Sat Nov 15 2025 06:38:58 GMT+0000 (Coordinated Universal Time)
5.79 కోట్ల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నాం : నవీన్ కుమార్
సికింద్రాబాద్ రైల్వే పోలీసులు ఈ ఏడాది 5.79 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

సికింద్రాబాద్ రైల్వే పోలీసులు ఈ ఏడాది 5.79 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. రైల్వే పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ నార్కోస్’తో ఈ ఏడాది అత్యధికంగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ నవీన్‌కుమార్ వెల్లడించారు, 2024లో తమ విభాగం 67 కేసుల్లో రూ.4.27 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. 82 మందిని అరెస్ట్ చేసి, సంబంధిత చట్ట అమలు సంస్థలకు అప్పగించాంమని ఆయన అని చెప్పారు.
107 మందిని అరెస్ట్ చేసి...
అయితే 2025లో ఇప్పటివరకు 88 కేసుల్లో రూ.5.79 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నామని, 107 మందిని అరెస్ట్ చేశామని ఆయన తెలిపారు. ఇది గత ఏడాదితో పోలిస్తే స్వాధీనం విలువలో 59 శాతం, అరెస్ట్‌లలో 62.12 శాతం పెరుగుదల అని వివరించారు. అరెస్ట్ అయినవారిని సంబంధిత చట్ట సంస్థలకు అప్పగించి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డ్రగ్స్ యువత ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తున్నాయని, ఈ దుష్ప్రవర్తనను అరికట్టడానికి ఎన్సీబీతో పాటు ఇతర సంస్థలతో కలిసి రైళ్లలో తనిఖీలు మరింత కఠినతరం చేశామని నవీన్‌కుమార్ పేర్కొన్నారు.
Next Story

