Fri Sep 13 2024 03:08:16 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో రౌడీషీటర్ల వీరంగం
హైదరాబాద్ లో రౌడీ షీటర్లు వీరంగం సృష్టించారు. కార్వాన్ నియోజకవ్గంలోతప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది
హైదరాబాద్ లో రౌడీ షీటర్లు వీరంగం సృష్టించారు. కార్వాన్ నియోజకవ్గంలోని తప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. రౌడీషీటర్లు పిల్లర్ నెంబరు 86గా ున్న వైష్ణవి వైన్స్, స్నేహ చికెన్ సెంటర్ల మీద దాడి చేశారు. జేసీబీ సాయంతో షాపులను కూల్చివేశారు. భారీ స్థాయిలో ఆస్తినష్టం జరిగిందని షాపు యజమానులు ఆరోపిస్తున్నారు.
రెండు షాపుల ధ్వంసం....
రౌడీషీటర్ల సాయంతో మహావీర్ కన్ స్ట్రక్షన్స్, క్రిస్టల్ గార్డెన్ యజమానులు ప్రవీణ్ రెడ్డి, చంద్రమౌళి కావ్యరెడ్డి ఈ దాడికి పాల్పడ్డారని యజమాని పోచయ్య తెలిపారు. ఈ దాడిలో తమకు 37 లక్షల మద్యం సీసాలు ధ్వంసమయ్యాయని వైష్ణవి వైన్స్ యజమాని రవీందర్ సింగ్ తెలిపారు. తనకు 50 వేల నష్టం వాటిల్లిందని స్నేహ చికెన్ సెంటర్ యజమాని తెలిపారు. ఈ స్థలానికి సంబంధించి వివాదం కారణంగానే ఈ దాడి జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. స్థల వివాదంపై కోర్టులో కేసు నడుస్తుందని ల్యాండ్ ఓనర్ పోచయ్య తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story