Sun Mar 08 2026 03:13:07 GMT+0530 (India Standard Time)
మెరుపు దోపిడీ...నిమిషాల్లోనే .. 24 కిలోల బంగారం దోపిడీ
దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. ఆయుధాలతో వచ్చి బెదిరించి మరీ బంగారాన్ని దోచుకెళ్లారు. రాజస్థాన్ లో ఈ ఘటన జరిగింది

దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. ఆయుధాలతో వచ్చి బెదిరించి మరీ బంగారాన్ని దోచుకెళ్లారు. నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ ఘటన పోలీసులను సయితం నివ్వెరపరిచింది. రాజస్థాన్ లోని ఉదయపూర్ లో ఈ ఘటన జరిగింది. ఈరోజు ప్రతాప్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మణప్పరం గోల్డ్ లోన్ బ్యాంక్ లోకిన ఐదుగురు దుండగులు వచ్చారు. ఆయుధాలతో వచ్చి అక్కడ సిబ్బందిని బెదిరించారు.
పది లక్షల నగదు...
చేతికి అందిన బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో 24 కిలోల బంగారం, పది లక్షల నగదును దుండగులు దోచుకెళ్లినట్లు సిబ్బంది పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిమిషాల్లో వచ్చి చోరీ చేసి మాయమై పోయారని సిబ్బంది చెబుతున్నారు. అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుండగుల కోసం ఉదయపూర్ నలుమూలలా పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story

