Mon Feb 02 2026 03:22:11 GMT+0000 (Coordinated Universal Time)
బస్సు ప్రమాదం : ఇద్దరి పరిస్థిితి విషమం
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తృటిలో తప్పింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న బస్సు పంట పొలాల్లోకి దూసుకెళ్లింది

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తృటిలో తప్పింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న బస్సు పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. కడప జిల్లా దువ్వూరు మండలం గుడిపాడు గ్రామం వద్ద అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లడంతో పలువురికి గాయాలయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే అదుపు తప్పి బస్సు ప్రమాదానికి గురైందని ప్రయాణికులు చెబుతున్నారు.
తిరుపతి వెళుతుండగా...
జగన్ ట్రావెల్స్‌కు చెందిన ఈ బస్సు ప్రమాదానికి గురైందని తెలియడంతో అందులో ప్రయాణిస్తున్న వారి బంధువులు ఆందోళనలో పడ్డారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
Next Story

