Sun Mar 15 2026 10:21:41 GMT+0530 (India Standard Time)
Road Accident : మహబూబ్నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి
మహబూబ్ నగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు.

మహబూబ్ నగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. జాతీయ రహదారి 44పై ఆటోను టిప్పర్ ఢీకొనగా ఆటోలో ఉన్నవారు మరణించారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారు ఎక్కడి వారు అన్న వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
అతి వేగమే..
అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. మరికొందరికి గాయాలయినట్లు కూడా తెలుస్తోంది. పూర్తి వివరాలు అందాల్సి ఉంది. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. టిప్పర్ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
Next Story

