Thu Mar 19 2026 22:08:10 GMT+0530 (India Standard Time)
హైదరాబాద్లో ప్రమాదం : నలుగురు మృతి
హైదరాబాద్లోని సాగర్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు

హైదరాబాద్లోని సాగర్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. తుర్కయాంజల్ వద్ద ఈ ప్రమాదం జిరిగింది. డీసీఎం, లారీ ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగింది. అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తుంది.
డీసీఎం, లారీ ఢీకొని...
వెంటనే పోలీసులు ఘటన స్థలికి చేరుకుని ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరణించింది ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు.
Next Story

