Thu Jan 29 2026 03:03:49 GMT+0000 (Coordinated Universal Time)
నల్లమల ఘాట్ రోడ్డులో ఆగిపోయిన వాహనాలు
శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని నల్లమల్ల ఘాటు రోడ్డు లో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది

నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని నల్లమల్ల ఘాటు రోడ్డు లో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోళ్ళపెంట సమీపంలో కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి.
లారీలు ఢీకొట్టడంతో...
దీంతో ఘాట్రోడ్డులో లారీ అడ్డంగా పడిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. ఘటన స్ళలానికి పోలీసులు చేరుకొని లారీలను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేకపోయినా పెద్దసంఖ్యలో వాహనాలు ఇరువైపులా నిలిచిపోవడంతో్ ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి.
Next Story

