Thu Mar 19 2026 02:59:21 GMT+0530 (India Standard Time)
Road Accident : రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
తెలంగాణలోని జగిత్యాల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు

తెలంగాణలోని జగిత్యాల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. జగిత్యాల - కరీంనగర్ రహదారిపై ఉన్న థరూర్ వద్ద ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.
బస్సు కారు ఢీకొని...
జగిత్యాలకు చెందిన నలుగురు కారులో ప్రయాణిస్తుండగా అందులో ఇద్దరు మరణించగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. కారు వెనక సీట్లో కూర్చున్న ఇద్దరికి గాయాలుకావడంతో వారిని ఆసుపత్రికి పంపి చికిత్స అందిస్తున్నారు. ఆర్టీసీ బస్సు ముందుటైరు ఊడిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

