Mon Mar 16 2026 10:13:17 GMT+0530 (India Standard Time)
టెంపో ట్రావెల్ లోయలో పడి పది మంది మృతి
ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాన్ లోయలోపడి పది మంది వరకూ మృతి చెందారు

ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాన్ లోయలోపడి పది మంది వరకూ మృతి చెందారు. రుద్రప్రయాగ్ లోని బద్రీనాధ్ హైవే సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో టెంపో ట్రావెలర్ లో ఇరవై మూడు మంది ప్రయాణికులున్నారు. రుద్రప్రయాగ్ వెళుతున్న టెంపోట్రావెలర్ అదుపుతప్పి లోయలో పడింది.
ఏడుగురిని కాపాడి...
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఎస్డీఆర్ఎఫ్, పోలీసు బృందాలు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అందులో నుంచి ఏడుగురిని కాపాడారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. పోలీసులు అన్ని రకాలుగా యాత్రికులకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story

