Thu Sep 12 2024 13:27:23 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్ ను ఢీకొని కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు
తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్ ను ఢీకొని కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందిన సంఘటన తిరుపతి సమీపంలో జరిగింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందినట్లు ప్రాధమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
అతి వేగమే....
సంఘటన స్థలికి వద్దకు పోలీసులు చేరుకుంటున్నారు. అతివేగమే ప్రాణాలు తీసిందని పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. వేగంగా వచ్చిన కారు డివైడర్ ను ఢీకొనడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.
Next Story