Thu Mar 27 2025 03:56:18 GMT+0000 (Coordinated Universal Time)
Road Accident : తెలంగాణలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. ఆదిలాబాద్ జిల్లా జందాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద ఈ ఘటన జరిగింది. ఆగి ఉన్న లారీని ప్రయివేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తో పాటు మరొకరు మరణించినట్లు పోలీసులు తెలిపారు.
రిమ్స్ ఆసుపత్రికి...
అయితే ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలు కావడంతో వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నేషనల్ హైవే పై ఈ ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ కు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. వెంటనే ఎన్ హెచ్ పెట్రోలింగ్ సిబ్బందితో పాటు పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. బస్సు హైదరాబాద్ నుంచి నాగపూర్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగంగా వచ్చి ఢీకొట్టినందు వల్లనే మరణించారని పోలీసులు ప్రాధమికంగా నిర్ణయించారు.
Next Story