Sun Feb 01 2026 19:44:17 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డు సమీపంలోని రాజీవ్ రాహదారిపై కారు ముందు వెళుతున్న లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
ఇద్దరు గాయపడటంతో...
గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి గల కారణమని తెలిసింది. వేగంగా వచ్చిన కారు లారీని ఢీకొట్టడం వల్ల ముందు సీట్లో ఉన్న ఇద్దరు మరణించారని పోలీసులు తెలిపారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

