Thu Mar 19 2026 09:11:44 GMT+0530 (India Standard Time)
అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు.

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. తాడిపత్రి నియోజకవర్గంలోని బొందలదిన్నె గ్రామ సమీపంలో లారీ - కారు ఢీకొన్నాయి. బెదరగుట్టపల్లి గ్రామానికి చెందిన ప్రతాప్ రెడ్డి, వెంకటలక్ష్మి, ప్రమీల ఒక బంధువుల ఇంట్లో వేడుక కోసం కడప జిల్లా వేంపల్లి గ్రామానికి వెళ్లారు.
కారు లారీ ఢీ...
తిరిగి తమ సొంత గ్రామానికి చేరుకునేందుకు కారులో బయలుదేరారు. అయితే బొందలదిన్నె గ్రామ సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ప్రతాప్ రెడ్డి, ప్రమీల అక్కడికక్కడే మరణించగా, గాయాలపాలయిన వెంకటలక్ష్మిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

