Mon Mar 16 2026 14:15:32 GMT+0530 (India Standard Time)
Road Accident : పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు తెలంగాణ యువకుల మృతి
మహారాష్ట్రలోని పూణెలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తెలంగాణకు చెందిన ఐదుగురు యువకులు మరణించారు

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తెలంగాణకు చెందిన ఐదుగురు యువకులు మరణించారు. పూణె నగరం శివార్లలో ఈ ప్రమాదం జరిగింది. భిగ్వాన్ సమీపంలో వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. స్పాట్ లోనే వారు మరణించారు. స్థానికులు గుర్తించి వారిని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మరణించిన యువకులంతా ఇరవై ఐదేళ్లలోపు వారేనని పోలీసులు చెబుతున్నారు.
మృతులందరూ...
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు రఫీక్ ఖురేషీ, ఇర్ఫాన్ పటేల్, మెహబూబ్ ఖురేషీ, ఫిరోజ్ ఖురేషీ, ఇర్ఫాన్ పటేల్ గా గుర్తించారు. ఈ వాహనంలో ప్రయాణిస్తున్న మరో యువకుడు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భారీ వర్షాలకు రోడ్లన్నీ చిత్తడిగా మారడంతో, మితిమీరిన వేగంతో వాహనం నడపడటం వల్లనే మరణించినట్లు పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. వీరి మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
Next Story

