Sun Feb 01 2026 20:03:38 GMT+0000 (Coordinated Universal Time)
Road Accident : బైకు లారీని ఢీకొని ముగ్గురు మృతి
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మరణించారు

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం అంజనీపురం టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న లారీనీ వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్డంతో ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.
అతి వేగమే...
మృతులు నాగతేజ రెడ్డి, ఇందు, అమూల్యగా గుర్తించినట్లు పేర్కొన్నారు. అతి వేగమే వీరి ముగ్గురి ప్రాణాలు తీసిందని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రక్షాబంధన్ కు ముందు రోజు ఈ ప్రమాదం జరిగి ముగ్గురు మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుము కున్నాయి.
Next Story

