Tue Mar 17 2026 01:36:22 GMT+0530 (India Standard Time)
కారు ఢీకొని భార్యాభర్తల మృతి
పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరు మరణించారు

పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరు మరణించారు. వినుకొండ మండలం లోని ఏ.కొత్తపాలెం గ్రామం లో ఈ ఘటన జరిగింది. ఈరోజు ఉదయం వినుకొండ వైపునుండి త్రిపురాంతకం వెళ్లే జాతీయ రహదారి పై కారు అదుపు తప్పి చింత చెట్టుకు ఢీ కొట్టటం తో కారు లో ఉన్న ఇద్దరు భార్య భర్త అక్కడికి అక్కడే మృతి చెందారు. కారు లోఉన్న వారి కుమారుడి గాయాలు పాలయ్యాడు.
కుమారుడికి గాయాలు...
ప్రమాదాన్ని గుర్తించిన స్థానిక ప్రజలు వెంటనే వినుకొండ పోలీస్ లకు సమాచారం ఇచ్చారు. దీంతో నుకొండ సీ.ఐ. సాంబశివరావు. పోలీస్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా క్రేన్ ద్వారా కారు ను పక్కకు తొలిగించి. మృతులను పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తునట్లు సీఐ తెలిపారు.
Next Story

