Thu Mar 19 2026 08:21:13 GMT+0530 (India Standard Time)
Road Accident : ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్ పై నుంచి బస్సు పడిపోయిన ఘటనలో ఐదుగురు మరణించారు

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్ పై నుంచి బస్సు పడిపోయిన ఘటనలో ఐదుగురు మరణించారు. ఈ ప్రమాదంలో 38 మంది వరకూ గాయపడ్డారు. ఒడిశాలోని జాజ్పూర్ జిల్లాలోని బారాబతి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ బస్సు కటక్ నుంచి బెంగాల్ లోని దిఘాకు వెళుతుండగా ఫ్లై ఓవర్ పైనుంచి పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో యాభై మంది వరకూ ప్రయాణికులు ఉన్నారని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.
డ్రైవర్ నిర్లక్ష్యమే...
అయితే ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారు సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బస్సు నిర్లక్ష్యంగా నడపటం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని బస్సులో ప్రయాణికులు చెబుతున్నారు. బహుశ డ్రైవర్ మద్యం సేవించి ఉంటాడన్న అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Next Story

