Thu Mar 19 2026 04:11:46 GMT+0530 (India Standard Time)
Road Accident : నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం .. ముగ్గురి మృతి
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండటం ముసునూరు టోల్ ప్లాజా వద్ద ఈ ప్రమాదం జరిగింది. లారీని ఓవర్ టేక్ చేయబోయిన కారు డ్రైవర్ దానిని ఢీకొట్టాడు. దీంతో ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు.
మరో ఇద్దరి పరిస్థితి...
వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. మృతులంతా పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంకు చెందిన వారిగా గుర్తించారు. చెన్నై వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

