Sun Mar 15 2026 10:47:40 GMT+0530 (India Standard Time)
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్
మెదక్ జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు

మెదక్ జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. రెండు లారీలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం బైపాస్ రోడ్డు పై ముందు వెళుతున్న లారీని వెనక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
క్యాబిన్ లో కూర్చున్న...
దీంతో లారీ క్యాబిన్ లో కూర్చున్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. గాయాల పాలయిన నలుగురిని పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

