Thu Mar 19 2026 07:04:00 GMT+0530 (India Standard Time)
Road Accident : ట్రాక్టర్ బోల్తా - ఐదుగురి మృతి
మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడి ఐదుగురు మరణించారు.

మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడి ఐదుగురు మరణించారు. మధ్యప్రదేశ్లోని దతియా జిల్లాలో భక్తులను తీసుకెళుతున్న ఒక ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడి ఈ విషాద ఘటన జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, ఇరవై మందికి పైగా గాయపడ్డారు. మైథనాపాలి గ్రామంలో జరిగిన ఈ ఘటనలో భక్తులు రతన్గడ్ మాతా మందిరానికి వెళ్తున్న సమయంలో ట్రాక్టర్ బోల్తాపడింది.
నిద్రమత్తే కారణమని...
బోల్తాపడిన ట్రాక్టర్ కల్వర్టులోకి దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. అయితే దీనికి ప్రధాన కారణం డ్రైవర్ నిద్రమత్తే కారణమని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన వారిలో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

