Tue Sep 10 2024 11:52:48 GMT+0000 (Coordinated Universal Time)
కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక కారు బావిలో పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక కారు బావిలో పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వద్ద ఎర్రకోట బావిలో కారు పడింది. బావిలో నీరు ఎక్కువగా ఉండటంతో కారు మొత్తం మునిగిపోయింది. ఈ కారులో ఎంత మంది ప్రయాణిస్తున్నదీ తొలుత తెలియరాలేదు.
బావిలో పడి....
కర్నూలు నుంచి ఎమ్మిగనూరు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అతి వేగంతో వస్తున్న కారు రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే కారు 30 అడుగుల లోతు ఉన్న బావిలో పూర్తిగా మునిగి పోవడంతో గజఈతగాళ్లను రప్పించి కారులో ఉన్న వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే కారులో ఉన్న నలుగురు మరణించారు. అయితే వీరు ఎక్కడి వారు అన్న సమాచారం ిఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story