Sun Mar 15 2026 11:54:04 GMT+0530 (India Standard Time)
Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద హైవేపై రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మరణించారు. మృతుల్లో లారీ డ్రైవర్లతో పాటు నలుగురు అందులో ప్రయాణిస్తున్న వారున్నారు. ఒక లారీ కృష్ణా జిల్లా బంటుమిల్లి వైపు వెళుతుండగా, మరొకటి పుదుచ్చేరి నుంచి భీమవరం వైపు వస్తుంది.
తాళ్లరేవుకు చెందిన...
రెండు లారీలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, మరొకరిని ఆసుపత్రికి తరలిస్తుండగా దారి మధ్యలో మరణించారు. మృతుల్లో ఐదుగురు పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లరేవుకు చెందిన వారుగా గుర్తించారు. లారీలో మొత్తం పది మంది ప్రయాణికులున్నారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. గాయపడిన ఐదుగురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రోడ్డు ప్రమాదంతో ట్రాఫిక్ స్థంభించింది. రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

