Mon Mar 16 2026 00:11:49 GMT+0530 (India Standard Time)
Road Accident : రెండు బైకులు ఢీకొని ముగ్గురు మృతి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఢీకొని ముగ్గురు మృతి చెందారు.

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన బెజ్జూరు మండలం పోతే పల్లి వద్ద జరిగింది. ప్రమాద సమాచారాన్ని వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మృతులు ముగ్గురూ...
మృతులు మహేష్, వెంగళరావు, నర్సింహగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఒకేసారి ముగ్గురు వ్యక్తులు మరణించడంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. వారి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కాగా, వేగంగా బైకులు నడపడం వల్లే ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తున్నది.
Next Story

