Thu Mar 19 2026 04:28:28 GMT+0530 (India Standard Time)
Road Accident : బస్సు బోల్తా.. నలుగురు మృతి
కర్ణాటకలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. బస్సు బోల్తాపడటంతో నలుగురు మృత్యువాత పడ్డారు. ముప్ఫయి మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈరోజు తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. ఒక ప్రయివేటు బస్సు బెంగళూరు నుంచి గోకర్ణకు వెళుతుండగా హోలాలకెరె టౌన్ సమీపంలో బోల్తా పడింది.
మరో ఎనిమిది మందికి...
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నారు. అతివేగంతో వెళ్లడం కారణంగానే అదుపుతప్పి బస్సు బోల్తాపడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఎనిమిది మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
Next Story

