Thu Mar 19 2026 19:58:25 GMT+0530 (India Standard Time)
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు.

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. బైకు పై వస్తున్న ముగ్గురు యువకులను ఒక లారీ ఢీకొట్టింది. బైకుపై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు మరణించినట్లు పోలీసులు చెప్పారు.
సంగారెడ్డి జిల్లా ....
మృతులది సంగారెడ్డి జిల్లా బోర్గి గ్రామంగా పోలీసులు గుర్తించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

