Tue Mar 17 2026 07:51:38 GMT+0530 (India Standard Time)
Road Accident : కాకినాడలో బైకును ఢీకొన్న కారు.. అక్కడిక్కడే ఇద్దరి మృతి
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడలో ఒక కారు బైకును వేగంగా ఢీకొట్టడంతో ఇద్దరు మరణించారు.

కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడలో ఒక కారు బైకును వేగంగా ఢీకొట్టడంతో ఇద్దరు మరణించారు. కాకినాడలోని కల్పనా సెంటర్ లో వేగంగా దూసుకొచ్చిన కారు బైకును ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడిక్కడే మరణించారు. మరో ఇద్దరికి ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు అయ్యాయి. కారులో మద్యం సీసాలున్నట్లు పోలీసులు గుర్తించారు.
మద్యం తాగి...
మద్యం తాగి వాహనం నడపటడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. కారును అతివేగంగా నడపటం వల్ల అదుపుతప్పి అది బైకును ఢీకొందని ప్రత్యక్ష సాక్షలు చెబుతున్నారు. గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

