Wed Mar 18 2026 18:18:23 GMT+0530 (India Standard Time)
ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురి మృతి
జార్ఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు.

జార్ఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. పెళ్లికి వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యాన్ అదుపు తప్పి బోల్తాపడి ప్రమాదానికి గురైింది. మరో పదకొండు మంది తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
మరికొందరి పరిస్థితి...
గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. వ్యాన్లో ప్రమాదం జరిగినప్పుడు నలభై ఐదు మంది వరకూ ఉన్నారని పోలీసులు తెలిపారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

