Sat Jan 31 2026 20:16:26 GMT+0000 (Coordinated Universal Time)
Road Accident : బోల్తా పడిన బస్సు .. నలుగురి మృతి
హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు

హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఈరోజు ఉదయం జరిగిన బస్సు ప్రమాదంలో నలుగురు మరణించగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జుబ్బల్ లోని గిల్తాడి రోడ్డుపై బస్సు బోల్తా పడి ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
హిమాచల్ ప్రదేశ్ లో...
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారికి చికిత్స కొనసాగుతుంది. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

