Tue Sep 10 2024 10:09:15 GMT+0000 (Coordinated Universal Time)
కేబుల్ బ్రిడ్జిపై అదుపుతప్పిన బైక్ .. గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు మృతి
హైదరాబాద్లోని గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు మరణించారు
హైదరాబాద్లోని గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు మరణించారు. కేబుల్ బ్రిడ్జిపై బైక్ పై వస్తూ డివైడర్ ను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో మరణించిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా గుర్తించారు. వీరు గుంటూరు జిల్లాకు చెందిన రోహిత్ , బాలప్రసన్నగా పోలీసులు చెబుతున్నారు.
అతి వేగమే ప్రమాదానికి.....
అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. స్పీడ్ గా వచ్చి బైక్ ను అదుపు చేయలేక డివైడర్ ను ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. గచ్చిబౌలి పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story