Fri Dec 05 2025 17:52:32 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్
తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. కాకినాడ బీచ్ కు వెళ్లివస్తుండగా కారు ట్యాంకర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. రంగంపేట మండలం వడిసలేరు వద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరికొందరికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ఇద్దరి పరిస్థితి విషమం...
గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మృతులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాధమికంగా గుర్తించారు. పోలీసులు మృతదేహాలను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

