Tue Mar 17 2026 11:53:27 GMT+0530 (India Standard Time)
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు.

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. చిత్తూరు - కర్నూలు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం వద్ద స్కూటర్ ను లారీ ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు మరణించారు.
మృతులు ముగ్గురూ...
అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాద వార్త తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిికి తరలించారు. మృతులు ఐరాల మండలానికి చెందిన రామతీర్థ ఎస్టీ కాలనీకి చెందని జయచంద్ర, నారాయణ, నాగమల్లయ్య గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్దు చేేస్తున్నారు.
Next Story

