Fri Oct 04 2024 06:04:55 GMT+0000 (Coordinated Universal Time)
Road Accident : ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. పదిహేను మందికి పైగా గాయపడ్డారు. ఒక ప్రయివేటు ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. నెల్లూరు జిల్లా కావలి ముసునూరు టోల్ప్లాజా వద్ద అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా ఉన్న బస్సును లారీ ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు.
రెండు లారీలు ఢీకొని...
ఇంకొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆగిఉన్న లారీని మరొక లారీ ఢీకొట్టడంతో ఆ లారీ ముందున్న బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో రెండు లారీలకు చెందిన ఇద్దరు డ్రైవర్లతో పాటు బస్సు డ్రైవర్ కూడా మరణించారు. మరో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందిన వారిలో ఉన్నారు. గాయపడిన పదిహేను మంది ప్రయాణికులు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మృతుల సంఖ్య...
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. బస్సు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జయింది. ప్రమాదస్థలికి వెంటనే చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. చెన్నై వైపు వెళుతున్న లారీలు హైదరాబాద్ వస్తున్న ప్రయివేటు ట్రావెల్స్ బస్సును ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. మొత్తం మూడు వాహనాలు ఢీకొట్టడం వల్లనే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Next Story