Wed Mar 18 2026 23:38:24 GMT+0530 (India Standard Time)
పుంగనూరు వద్ద రోడ్డు ప్రమాదం : ముగ్గురి మృతి
చిత్తూరు జిల్లా పుంగనూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు.

చిత్తూరు జిల్లా పుంగనూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. అరవపల్లి వద్ద జరిగిన ఈ ఘటనలో కొందరు గాయపడ్డారు. వేగంగా వచ్చిన కారు చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.
మరికొందరి పరిస్థితి విషమం...
గాయపడిన కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతులు పుంగనూరుకు చెందిన కుమార్, భాగ్యరాజ్, రవి అని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

