Wed Feb 04 2026 16:29:23 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
విశాఖ జిల్లాలోని మధురవాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

విశాఖ జిల్లాలోని మధురవాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై బైక్ పై వెళ్తున్న వారిని లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు.
ఒకే కుటుంబానికి....
మృతులుగా పేర్కొన్న రమణ, అతని భార్య రంబయ్, కుమార్తె శాంతి కుమారి బుధవారం విజయనగరం జిల్లా పోలిపిల్లిలో బుధవారం ఓ ఫంక్షన్ కు హాజరై గురువారం తెల్లవారుజామున స్వగృహానికి తిరుగు పయనమయ్యారు. మార్గమధ్యంలో ఈ ప్రమాదం జరగడంతో ఆ ముగ్గురు స్పాట్ లోనే మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story
