Fri Feb 14 2025 17:15:51 GMT+0000 (Coordinated Universal Time)
కడప జిల్లాలో బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు
వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం గుడిపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.

వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం గుడిపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న బస్సు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తుండగా ఈ బస్సుకు ప్రమాదం జరిగింది.
గాయపడినవారిని...
గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఎవరికీ ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. అతివేగంగా రావడంతోనే బస్సు బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును నడిపారని, అందువల్లనే బస్సు అదుపుతప్పిడివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడిందని పోలీసులు తెలిపారు.
Next Story