Tue Dec 09 2025 07:20:28 GMT+0000 (Coordinated Universal Time)
Road Accident : తిరుపతి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించారు

తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించారు. రెండు కార్లు పరస్పరం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. తిరుపతి జిల్లా తణుకుపేట వద్ద ఈ ప్రమాదం జరిగింది. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది.
కొందరికి గాయాలపాలై...
కారులో ఉన్న ముగ్గురు యువకులు మరణించారు. కొందరికి ఈ ప్రమాదంలో గాయాలయ్యాయి. గాయాలపాలయిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలికి వచ్చి ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

