Fri Dec 05 2025 21:53:07 GMT+0000 (Coordinated Universal Time)
Road Accident : రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. రాంగ్ రూట్ లో వస్తున్న టిప్పర్ స్కూటీని ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఖమ్మం జిల్లాకు చెందిన మామ, కోడలు చనిపోగా, గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలిస్తుండగా అందులో ఒకరు మరణించారు.
రాంగ్ రూట్ లో వచ్చి...
ఒక చిన్నారి మృతి చెందగా, మరొక బాలుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో ఈ రహదారిపై ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. వెంటనే ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. టిప్పర్ డ్రైవర్ పై కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

