Fri Dec 05 2025 11:58:33 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ముగ్గురి మృతి
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు.

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ వద్ద కాశిరెడ్డి నాయన ఆశ్రమం సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈరోజు ఉదయం స్కార్పియో వాహనం ముందు వెళుతున్న ట్రాక్టర్ ను బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుమందికి తీవ్రగాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి మైదుకూరుకు బయలుదేరిన కుటుంంబం ప్రయాణిస్తున్న వాహనం ట్రాక్టర్ ను వెనక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
వేగాన్ని నియంత్రించలేక...
వేగాన్ని నియంత్రించలేక ముందు వెళుతున్న ట్రాక్టర్ ను గుద్దేశారని అంటును్నారు. మృతులను మున్షీ, కమల్ భాషాగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో మొత్తం పది మంది ప్రయాణిస్తున్నారు. అందులో చికిత్స పొందుతూ మూడేళ్ల చిన్నారి షేక్ నదియా మృతి చెందారు. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

