Sat Dec 13 2025 22:33:16 GMT+0000 (Coordinated Universal Time)
Raod Accident : కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఢీకొట్టడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు

కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఢీకొట్టడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమవరం జాతీయ రహదారిపై కారు బీభత్సం సృష్టించింది. విద్యార్థులు కళాశాలలకు వెళ్లడానికి బస్టాప్ లో వేచి చూస్తున్నారు. విద్యార్థులతో పాటు పలువురు ప్రయాణికులు కూడా ఉన్నారు. అయితే కారు టైర్ పంక్చర్ కావడంతో అదుపు తప్పి అది విద్యార్థులపైకి దూసుకు వచ్చిందని చెబుతున్నారు.
టైరు పేలడంతో...
కానీ కారు ప్రమాదం టైరు పేలడం వల్ల జరిగిందా? కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా? అన్నది పోలీసులు విచారిస్తున్నారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. వారిని వెంటనే కాకినాడ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జాతీయ రహదారిపై బస్సు కోసం వేచి చూస్తున్న వారిపై కారు దూసుకు రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

