Wed Jan 21 2026 00:39:43 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర రోడ్డుప్రమాదం.. విజయవాడ వాసులు దుర్మరణం
కాగా.. ప్రమాదంలో మరణించినవారంతా కృష్ణాజిల్లా అవనిగడ్డకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మృతులు రమేష్, నరసింహమూర్తి..

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఆదివారం మధ్యాహ్న సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిట్ట కండ్రిగ వద్ద కారు - లారీ ఢీ కొన్న ఈ దుర్ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. తిరుపతి నుంచి శ్రీకాళహస్తి వైపు ఏడుగురు వ్యక్తులు ఇన్నోవాలో వెళ్తుండగా.. అదుపుతప్పిన ఓ లారీ బలంగా ఢీ కొట్టింది. ప్రమాదంలో ఇన్నోవా.. లారీ కింది భాగంలో చొచ్చుకుపోయి నుజ్జునుజ్జైంది. నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ప్రయాణిస్తోన్న మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా.. ప్రమాదంలో మరణించినవారంతా ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మృతులు రమేష్, నరసింహమూర్తి, రాజ్యలక్ష్మి, శ్రీలత, అక్షయ, వెంకటరమణమ్మలుగా గుర్తించారు. గాయపడిన భరత్ నుంచి బంధువుల వివరాలు తెలుసుకుని వారికి సమాచారం అందించినట్లు తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని.. శ్రీకాళహస్తికి వెళ్లి వాయులింగేశ్వర స్వామి దర్శనం పూర్తి చేసుకుని విజయవాడ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలోనే తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి వెళ్తుండగా మిట్ట కండ్రిగ వద్ద ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీ కొట్టింది. అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
Next Story

