Sat Mar 07 2026 20:07:22 GMT+0530 (India Standard Time)
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది

ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వ దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బైకును లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. మృతులు అంబాపురం వాసులు వినోద్, నాని, వీరేంద్రలుగా గుర్తించారు.
శనివారం తెల్లవారు జామున తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముగ్గురు వ్యక్తులు స్పాట్లోనే మరణించారు. స్థానికల సమాచారంతో ఘటన స్థలంకు చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులంతా అంబాపురానికి చెందిన వినోద్, నాని, వీరేంద్రలుగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story

