Sat Mar 21 2026 13:56:58 GMT+0530 (India Standard Time)
ఘోర రోడ్డు ప్రమాదం.. 16 మంది మృతి
మృతదేహాలను పోస్టుమార్టమ్ కు తరలించారు. కాగా.. ప్రమాదానికి గురైన వాహనాల వివరాలు, మృతుల వివరాలు, ప్రమాదానికి గల కారణాలు..

నేపాల్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 మంది మృతి చెందారు. అక్కడి బారా జిల్లాలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 16 మంది ఘటనా ప్రాంతంలోనే మరణించగా.. 24 మందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మృతదేహాలను పోస్టుమార్టమ్ కు తరలించారు. కాగా.. ప్రమాదానికి గురైన వాహనాల వివరాలు, మృతుల వివరాలు, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ఇటీవల భారత్ లో వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో రోడ్డు ప్రమాదాల వల్ల నిత్యం పదుల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి.
Next Story

