Tue Jan 20 2026 21:27:50 GMT+0000 (Coordinated Universal Time)
కారు-బైక్ ఢీకొని ఐదుగురు మృతి
హైదరాబాద్, నాగార్జున సాగర్ ప్రధాన రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం

హైదరాబాద్, నాగార్జున సాగర్ ప్రధాన రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్-కారు ఢీకొని ఐదుగురు మృతి చెందారు. బైక్పై వెళ్తున్న దంపతులతో సహా కుమారుడు మృతిచెందాడు. దంపతులు మద్దిమడుగు ప్రసాద్ (36), మద్దిమడుగు రమణ(30), కొడుకు అవినాష్(12) మృతిచెందారు. మృతులు పీఏ పల్లి మండలం అక్కంపల్లికి చెందిన వారిగా గుర్తించారు. కారు బోల్తా పడి డ్రైవర్ మణిపాల్, మల్లిఖార్జున్(18) మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబాలను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్ పరామర్శించారు.
ప్రసాద్ తన భార్య, కుమారుడితో కలిసి హైదరాబాద్ నుంచి చింతపల్లి మండలం అంకపల్లికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. నసర్లపల్లి వద్ద వేగంగా వచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. క్షతగాత్రులను దేవరకొండ ఆసుపత్రికి తీసుకెళ్లగా, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Next Story

