Thu Mar 19 2026 06:51:47 GMT+0530 (India Standard Time)
పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా..ఏడుగురు దుర్మరణం
పెళ్లి వేడుకలో సరదాగా గడపాల్సిన వారంతా కారాని లోకాలకు పయనమయ్యారు. బుధవారం సాయంత్రం సమయంలో పూతలపట్టు..

పెళ్లిబృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడి ఏడుగురు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. పెళ్లి వేడుకలో సరదాగా గడపాల్సిన వారంతా కారాని లోకాలకు పయనమయ్యారు. బుధవారం సాయంత్రం సమయంలో పూతలపట్టు లక్ష్మయ్య గ్రామం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 26 మంది పెళ్లిబృందంతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా ఏడుగురు మృతి చెందగా.. 19 మంది గాయపడ్డారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. మృతులు, క్షతగాత్రులంతా ఐరాల మండలం జంగాలపల్లి ఎస్సీ కాలనీకి చెందినవారుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.
Next Story

