Sun Oct 06 2024 00:48:10 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు దుర్మరణం
కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. శుక్రవారం రాత్రి
కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. శుక్రవారం రాత్రి ట్రక్కు - కారు ఢీ కొన్న ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా.. మొత్తం నలుగురు మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. ట్రక్ డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగే ప్రమాదానికి కారణమయ్యాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలోనే మరో ఆరుగురు వ్యక్తులు తీవ్రగాయాలపాలవ్వగా.. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
Also Read : చైనాలో భారీ భూకంపం.. వణికిపోయిన ప్రజలు
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ వెస్ట్ కుల్దీప్ జైన్ తెలిపిన వివరాల మేరకు.. ట్రక్కు ఢీ కొట్టడంతో.. కారు పూర్తిగా ధ్వంసమయింది. ఈ ప్రమాదానికి కారణమైన లారీ ముందున్న మరో లారీని ఢీ కొట్టింది. పూర్వాంకర అపార్ట్ మెంట్ సమీపంలోని నైస్ రోడ్డులో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టమ్ కు తరలించారు. కాగా.. మృతులు, క్షతగాత్రులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story