Sat Mar 07 2026 21:55:21 GMT+0530 (India Standard Time)
Road Accident : ట్రాక్టర్ బోల్తా..పెళ్లి బృందంలో పదమూడు మంది మృతి
ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళుతున్న ట్రాక్టర్ బోల్తాపడి పదమూడు మంది మృతి చెందారు.

ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళుతున్న ట్రాక్టర్ బోల్తాపడి పదమూడు మంది మృతి చెందారు. మధ్యప్రదేశ్ లో ఈ విషాదం చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ లోని రాజ్్గఢ్ జిల్లాలోని పిప్లోధిజాద్ లో నిన్న రాత్రి పెళ్లి బృందం ట్రాక్టర్ ట్రాలీతో బోల్తాపడింది ఈ ప్రమాదంలో పదమూడు మంది మరణించగా పదిహేను మంది వరకూ గాయపడ్డారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. మహిళలు కూడా ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పదిహేను మంది...
స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు సహాయక కార్యక్రమాలను ప్రారంభించారు. గాయపడిన పదమూడు మందిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారికి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మిగిలిన వారికి ప్రాణాపాయం లేదని చెప్పారు. రాజస్థాన్ నుంచి వచ్చిన పెళ్లి బృందం ఈ ప్రమాదానికి గురయిందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

