Fri Dec 26 2025 05:45:45 GMT+0000 (Coordinated Universal Time)
Road Accident : గుంటూరు జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
గుంటూరు జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు

గుంటూరు జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ల్లపాడు, అంకిరెడ్డి పాలెం వద్ద ఆగివున్న కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరొక ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వారిని సూర్యాపేట వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతులను సుశీల, వెంకయ్య, మహేశ్ లుగా గుర్తించారు.
సూర్యాపేటకు చెందిన వారుగా...
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. అతివేగంతో పాటు పొగమంచు కూడా ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

