Mon Sep 09 2024 11:03:01 GMT+0000 (Coordinated Universal Time)
గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, మరొకరి పరిస్థితి విషమం
నిత్యం రద్దీగా ఉండే గచ్చిబౌలి విప్రో జంక్షన్ నుంచి ఐఐఐటి జంక్షన్ వైపు ముగ్గురు యువకులు బైక్ పై వస్తున్నారు. సరిగ్గా బైక్
ప్రతిరోజూ.. ఎక్కడోచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మద్యం సేవించి డ్రైవ్ చేయడం, అతివేగం ఇలా అనేక కారణాలతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫలితంగా ఆ ప్రమాదాలు కొన్ని కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. తాజాగా గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. నిత్యం రద్దీగా ఉండే గచ్చిబౌలి విప్రో జంక్షన్ నుంచి ఐఐఐటి జంక్షన్ వైపు ముగ్గురు యువకులు బైక్ పై వస్తున్నారు. సరిగ్గా బైక్ IIIT జంక్షన్ వద్ద ఉన్న సబ్ స్టేషన్ గేట్ ను వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఆ సమయంలో బైక్ ప్రయాణిస్తున్న ముగ్గురిలో.. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
మరో యువకుడు రాజ్ కుమార్ (21) తీవ్రగాయాలవ్వగా.. అతడిని సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. గాయపడిన యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాలను పరిశీలించారు. మృతులు మధ్యప్రదేశ్ లోని సిద్ధి జిల్లాకు చెందిన అరవింద్ కుమార్ సాహో (28), మునిష్ కునర్ సాకేత్ (25) లుగా గుర్తించారు. వీరంతా నానక్ రామ్ గూడలోని ఓ రూమ్ లో నివాసం ఉంటున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News Summary - Road Accident at Gachibowli, 2 died and 1 more injured
Next Story