Fri Sep 13 2024 02:25:38 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖలో కలకలం...రిసార్ట్స్ లో డ్రగ్స్
విశాఖ జిల్లాలోని అచ్యుతాపురం మండలం కొండకర్ల అవా సమీపంలోని ఎస్ఐఎస్ రిసార్ట్స్ లో మత్తు పదార్థాలు ఉన్నాయి.
విశాఖ జిల్లా టూరిజంగా అభివృద్ధి చెందుతుండటంతో దానితో పాటు మత్తు పదార్థాల సరఫరా ముఠా కూడా దీనిపై కన్నేసింది. రిసార్ట్స్ కు వచ్చే వారికి మత్తు పదార్థాలను సరఫరా చేస్తూ పెద్దయెత్తున సంపాదనకు స్థానిక యువకులు కొందరు తెరతీశారు. అయితే పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు.
నలుగురు యువకులు....
విశాఖ జిల్లాలోని అచ్యుతాపురం మండలం కొండకర్ల అవా సమీపంలోని ఎస్ఐఎస్ రిసార్ట్స్ లో మత్తు పదార్థాలు ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు రిసార్ట్ పై దాడి చేశారు. ఎండీఎంఏ నాలుగు పిల్స్, , ఎండీఎంఏ క్రిస్టల్ పౌడర్ ప్యాకెట్లు రెండు, వంద గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నాు. విశాఖకు చెందిన తంగేటి భరత్ ను ప్రధాన నిందితుడిగా గుర్తించా3రు. అతనితో పాటు మరో ముగ్గురు విశాఖ యువకులను అరెస్ట్ చేశారు.
Next Story