Thu Sep 12 2024 12:39:14 GMT+0000 (Coordinated Universal Time)
రేపల్లె అత్యాచార కేసును చేధించిన పోలీసులు
నిందితులు మహిళ భర్తను టైమ్ అడగ్గా.. అతను తన వద్ద వాచీ లేదని చెప్పాడు. దాంతో నిందితులు అతనితో గొడవకు..
రేపల్లె : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం రేపిన రేపల్లె రైల్వేస్టేషన్ లో జరిగిన అత్యాచార కేసును పోలీసులు కొన్ని గంటల్లోనే చేధించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ముగ్గురిలో ఒకడు మైనర్ బాలుడిగా పోలీసులు తెలిపారు. విజయకృష్ణ, నిఖిల్ యువకులతో పాటు.. బాలుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. బాపట్ల జిల్లా ఎస్పీ వకుళ్ జిందాల్ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.
గత అర్థరాత్రి ఒంటిగంట సమయంలో మహిళపై అత్యాచారం జరిగినట్లు ఎస్పీ తెలిపారు. నిందితులు మహిళ భర్తను టైమ్ అడగ్గా.. అతను తన వద్ద వాచీ లేదని చెప్పాడు. దాంతో నిందితులు అతనితో గొడవకు దిగారు. అనంతరం అతడిని కొట్టి రూ.750 లాక్కున్నారు. బాధితురాలి జుట్టుపట్టుకుని పక్కకు లాక్కెళ్లి ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డారు. బాధితురాలి భర్త స్థానికుల సహాయంతో రేపల్లె పోలీసులను ఆశ్రయించినట్లు ఎస్పీ వివరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి రాజకీయ కోణం లేదని ఎస్పీ వకుళ్ జిందాల్ స్పష్టం చేశారు. రేపల్లె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళను మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ కు తరలించారు.
Next Story